తెలుగుదేశం పార్టీలో నందమూరి బాలకృష్ణ పొజిషన్ ఏంటో అందరికీ తెలిసిందే. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య, పార్టీ విషయాల్లో చాలా తక్కువగా జోక్యం చేసుకుంటారు. కానీ ఒకవేళ తాను ఏ విషయంలోనైనా జోక్యం చేసుకుంటే అది అవ్వాల్సిందే. ఎక్కువగా ఎన్నికల సమయంలో తనకు కావల్సిన వాళ్ళకు బాలయ్య టిక్కెట్లు ఇప్పించుకుంటారు. అలా గత కొన్ని ఎన్నికల నుంచి బాలయ్య తన మిత్రులకు, బంధువులకు టిక్కెట్లు దక్కేలా చేసుకుంటున్నారు.