టీడీపీలో కీలకంగా ఉన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు....ఈ మధ్య కాస్త దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన డిజిటల్ మహానాడు కార్యక్రమంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన, రామ్మోహన తాజాగా ప్రత్యేక హోదా అంశంలో జగన్పై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో 25కి 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని చెప్పిన జగన్, కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టారని ఫైర్ అయిపోయారు. వైసీపీకి 22 లోక్సభ, 6 గురు రాజ్యసభ సభ్యులున్న సరే హోదా తీసుకురావడంలో జగన్ విఫలమయ్యారని, కనీసం విభజన హామీలపై కేంద్రంతో పోరాడలేకపోతున్నారని అంటున్నారు.