ఏపీ ప్రజలకు సీఎం జగన్ మీద ఏమన్నా నెగిటివ్ ఉందా? అంటే కాస్త అవునని, కాస్త కాదనే చెప్పొచ్చు. ఏ సీఎం అయిన సరే అన్నీ వర్గాల ప్రజలని మెప్పించడం చాలా కష్టం. కాకపోతే మెజారిటీ ప్రజలని మెప్పిస్తే ఆ నాయకుడుకు తిరుగుండదు. జగన్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేద, మధ్యతరగతి ప్రజలకు ఎక్కువగా అండగా ఉంటున్నారు. వరుసపెట్టి సంక్షేమ పథకాలు అందిస్తూ, వారి మెప్పు పొందుతున్నారు. రెండేళ్లుగా సంక్షేమ వరాలు కురిపిస్తూనే ఉన్నారు.