ఏపీలో వారసత్వ రాజకీయాలు కాస్త ఎక్కువగానే ఉంటాయన్న సంగతి తెలిసిందే. ప్రతి నాయకుడు, తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, మంచి పొజిషన్లో చూడాలని అనుకుంటారు. ఇప్పటికే ఏపీలో చాలామంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. అసలు చెప్పుకుంటే దివంగత వైఎస్సార్ వారసుడుగా జగన్, చంద్రబాబు వారసుడుగా లోకేష్ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు.