కరోనాని నివారించగలిగేది టీకా మాత్రమే అని ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, స్థానిక విశ్వాసాలతో చాలామంది టీకా వేయించుకోడానికి వెనకడుగేస్తున్నారు. టీకాలు వచ్చిన తొలినాళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండేది. కానీ సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వ్యాక్సిన్ కోసం జనం ఎగబడుతున్నారు, నిల్వలు లేక వ్యాక్సినేషన్ ఆలస్యం అవుతోంది. అయితే ఉత్తరాదిలో మాత్రం ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో టీకా అంటే భయపడుతున్నారు ప్రజలు. వారిలో ఆ భయం తొలగించడానికి కొన్ని గ్రామాల సర్పంచ్ లు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.