సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన ముగించుకొని ఎర్రవెల్లి ఫాం హౌస్ వెళ్తున్న సమయంలో.. తూప్రాన్ సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్ వద్ద వినతి పత్రంతో నిలబడి ఉన్నా సత్తార్ ను సీఎం గమనించారు. తన కాన్వాయ్ ఆపారు. భద్రతా సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్నారు. సత్తార్ చేతిలో ఉన్న వినతిపత్రాన్ని తీసుకున్నారు.