పూర్వం కాలంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి. డెబ్భై ఏళ్ల ముసలి వాళ్లకు ఎనిమిదేళ్ల చిన్న పిల్లలను ఇచ్చి పెళ్ళి చేసేవారు. ఇక అప్పట్లో కన్యాశుల్కం కూడా ఉండేది. ముసలి వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి వారిని కొనుకొనేవారు. సమాజంలో బాల్య వివాహాలను రూపుమాపేందుకు అనేక మంది సంఘసంస్కర్తలు దీనిపై పోరాటం చేశారు.