థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో చిన్నారుల చికిత్సకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ కొవిడ్ చికిత్స ప్రొటోకాల్ పేరుతో వెలువడిన సూచనలన్నీ కేవలం పెద్దల చికిత్సకోసం మాత్రమేనని చెబుతున్న నిపుణులు.. చిన్నారుల చికిత్సకోసం ప్రత్యేకంగా గైడ్ లైన్స్ విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) వీటిని విడుదల చేసింది.