టీడీపీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటినుంచి, ఆ పార్టీకి చెందిన నేతలు చాలామంది వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. వైసీపీతో ఇబ్బంది అనుకున్నవారు బీజేపీలోకి వెళ్ళగా, మిగతా నాయకులు వరుసపెట్టి వైసీపీలోకి జంప్ చేశారు. గత రెండేళ్లుగా టీడీపీ నేతలు వైసీపీలోకి వెళుతూనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో వలసల కార్యక్రమానికి బ్రేక్ పడింది. కరోనా సమయంలో జంపింగ్‌లు జరగలేదు.