టీడీపీ అధికారం కోల్పోయాక చాలామంది నేతలు సైలెంట్ అయిపోతే, మరి కొందరు నేతలు పార్టీ మారిపోయారు. ఇప్పటికీ జగన్ దెబ్బకు నాయకులు బయటకొచ్చి టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉండటం లేదు. కానీ కొందరు నాయకులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి, టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలా పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్న నాయకుల్లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్నీ వీరాంజనేయులు ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు.