వైసీపీకి ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉందో అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో ఆ పార్టీ 175 స్థానాలకు గాను, 151 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇందులో సీఎం జగన్ని పక్కనబెడితే వైసీపీకి 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే టీడీపీ-జనసేనల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని కూడా కలుపుకుంటే 155 మంది అవుతారు. అయితే 155 మంది ఎమ్మెల్యేలు మంచి పనితీరు కనబరుస్తున్నారా? ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారా? అంటే చెప్పడం కష్టం.