ఏపీలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి చంద్రబాబు, నారా లోకేష్‌లు గట్టిగానే కష్టపడుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీకి ధీటుగా తమ పార్టీని బలోపేతం చేసి, నెక్స్ట్ ఎన్నికల్లో గెలిపించడానికి తండ్రికొడుకులు కష్టపడుతున్నారు. అయితే ఈ రెండేళ్లలో చంద్రబాబు, చినబాబులు పార్టీని ఏ మేర బలోపేతం చేశారు? అంటే చెప్పడం కష్టమే. ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలని బట్టి చూస్తే టీడీపీ ఇంకా బలపడలేదని అర్ధమవుతుంది.