గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి, పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ ఎక్కువైన విషయం తెలిసిందే. చంద్రబాబుకు వయసు మీద పడటం, నారా లోకేష్‌కు పార్టీని నడిపించే సత్తా లేదని చెబుతూ, కొందరు టీడీపీ కార్యకర్తలు పార్టీలోకి ఎన్టీఆర్ వస్తే బెటర్ అని మాట్లాడుతున్నారు. అలాగే పార్టీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం కొందరు ఎన్టీఆర్ జెండా కట్టి హడావిడి చేశారు.