కేంద్రంలో బీజేపీ రెండోసారి సొంత బలంతో అధికారంలోకి రావడంతో ఏపీకి రావాల్సిన హోదా, విభజన హామీలు అమలు విషయంలో సీఎం జగన్ గట్టిగా మోదీ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీకి మంచి మెజారిటీ ఉంది కాబట్టి, వారిని ఏది డిమాండ్ చేయలేమని, ఏదైనా ప్లీజ్, ప్లీజ్ అంటూ అడగాల్సిందే అని జగన్ సీఎం పీఠం ఎక్కిన తొలిరోజుల్లోనే తేల్చేశారు.