ఏపీలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే. జగన్ ఇమేజ్ కావొచ్చు, ప్రభుత్వం అందించే పథకాలు కావొచ్చు ఇలా ప్రతి అంశం ఎమ్మెల్యేలకు బాగా ప్లస్ అవుతుంది. కొంతమందికి సొంతంగా పెద్దగా బలం లేకపోయిన సరే వారికి జగన్ ఇమేజ్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసినంత పని చేసింది.