సీఎం జగన్ తాజాగా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను కేంద్రంలోని మంత్రుల వద్ద ప్రస్తావించారు. ఎప్పటి నుంచో ఎటూ తేలకుండా ఉన్న దిశ చట్టం, మూడు రాజధానులు, జిల్లాల ఏర్పాటు, పోలవరం నిధులు, వీటితోపాటు.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు.. ఇలా.. అనేక అంశాలను ఆయన ఢిల్లీలో పెద్దల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో కీలకమైన మరో విషయం జోలికి జగన్ పోకపోవడంపై వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం.