టీడీపీతో పొత్తు విడిపోయిన దగ్గర నుంచి ఏపీ బీజేపీ నేతలు, చంద్రబాబుని ఏ రేంజ్లో టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో తాము గెలవకపోయినా పర్లేదు..కానీ చంద్రబాబుని చిత్తుగా ఓడించడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసి సక్సెస్ అయింది. అనూహ్యంగా టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. భారీగా సీట్లు దక్కించుకుని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక బీజేపీకి ఒక్కశాతం ఓట్లు కూడా రాలేదు.