మరో ఆరు నెలల్లో ఏపీ కేబినెట్లో మార్పులు జరగనున్న నేపథ్యంలో, ఎవరు జగన్ కేబినెట్లో ఉంటారు? ఎవరు కేబినెట్ నుంచి తప్పుకుంటారు? అనే అంశాలు బాగా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కేబినెట్లో ఉన్నవారు తమ మంత్రి పదవులని కాపాడుకోవాలని గట్టిగానే కష్టపడుతున్నారు. అటు మంత్రులుగా ఛాన్స్ కొట్టేయాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం(సిక్కోలు) జిల్లాలో ఎవరు జగన్ కేబినెట్లో చోటు దక్కించుకుంటారో అనే అంశంపై ఆసక్తి నెలకొంది.