నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు....జగన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచే అదే పార్టీకి వ్యతిరేకంగా రాజుగారు ఎప్పటినుంచో ముందుకెళుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ చేయని విధంగా రఘురామ, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే రఘురామ కేవలం చంద్రబాబు డైరక్షన్లో నడుస్తూ, జగన్‌ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అలాగే ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారు.