ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్న అది పెద్ద సంచలనమే అని చెప్పాలి. ఈ రెండేళ్ల కాలంలో జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఐదుగురుకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం అనేది కూడా ఒకటి. గతంలో చంద్రబాబు, ఇద్దరికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఓసీ వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు, బీసీ వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తిలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అలాగే వారు మంత్రులు కూడా ఉన్నారు.