నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం. చాలా ఏళ్ళు కాంగ్రెస్లో కీలకంగా పనిచేసిన కిరణ్కు వైఎస్సార్ మరణం, రోశయ్యకు వయసు మీద పడటంతో ఉమ్మడి ఏపీ సీఎంగా అవకాశం దక్కింది. అయితే ఈయన సీఎంగా ఉండగానే రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోకుండా చేయడానికి కిరణ్ గట్టిగానే ట్రై చేశారు. కానీ కుదరలేదు. దీంతో కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసి, జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి, 2014 ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయి, అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు.