ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి తీవ్ర ఇరకాటంగా మారింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన `మాట`లే ఆయనకు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు విపరీతమైన హామీలు గుప్పించారు జగన్. అదే సమయంలో పార్టీ నేతలకు కూడా అనేక హామీలు ఇచ్చారు. కొందరిని పోటీ నుంచి తప్పించేందుకు పదవుల ఆశ చూపించారు. మరికొందరికి పార్టీ పదవుల హామీలు ఇచ్చారు.