దగ్గుబాటి వెంకటేశ్వరరావు.....తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. ఎన్టీఆర్ పెద్దల్లుడుగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గుబాటి, కొన్నేళ్లు టీడీపీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ని గద్దె దింపి చంద్రబాబు టీడీపీ పగ్గాలు, సీఎం పీఠం దక్కించుకున్నాక దగ్గుబాటి పూర్తిగా సైడ్ అయిపోయారు. భార్య పురంధేశ్వరితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్‌లో భార్యాభర్తలకు మంచి పొజిషన్ దక్కింది.