ఎంపీ రఘురామకృష్ణంరాజు...ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అయిన నాయకుడు. ఢిల్లీలో ఉంటూ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న నేత. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచి, జగన్‌పైన తీవ్ర విమర్శలు చేస్తున్న రాజుగారి రాజకీయం రోజురోజుకూ మారుతుంది. అయితే తమ పార్టీ నుంచే గెలిచి తమకు తలనొప్పిగా మారిన రఘురామకు చెక్ పెట్టాలని జగన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తుంది.