విశాఖపట్నంలో టీడీపీ నేతల భూ కబ్జాల బాగోతాలు అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. గత చంద్రబాబు ప్రభుత్వంలో విశాఖ టీడీపీ నేతలు అనేక ప్రభుత్వ భూములని ఆక్రమించుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో సహ ఇతర వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా సైతం టీడీపీ నేతలని టార్గెట్ చేసి వరుసపెట్టి కథనాలు వేస్తుంది.