కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి, ఉద్యోగాలు పోయి, పనులు లేక ప్రజలు అల్లాడిపోతుంటే వారిపై పెట్రోభారం మోపిన కేంద్ర ప్రభుత్వం తమ విధానాల్ని సమర్థించుకోడానికి తాపత్రయపడుతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించామని, దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ పథకం కోసం లక్షకోట్లు కేటాయించామని, ఆ సొమ్మంతా ఎక్కడినుంచి రావాలని ప్రశ్నిస్తున్నారు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్రం చర్యల్ని సమర్థించారు.