చైనా గూఢచారి జున్వే 2010లో హైదరాబాద్లో కొద్దిరోజులు ఉన్నట్టు వెల్లడించాడు. అయితే తాను ఎక్కడ ఉన్నది మాత్రం చెప్పలేదు. అంతే కాదు.. హైదరాబాద్లో ఎవరిని కలిశాడు. ఏం చేశాడనే వివరాలు చెప్పలేదు. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశం కావడంతో భద్రతా దళాలు చైనా గూఢచారి గురించిన సమాచారాన్ని ఇక్కడి పోలీసులకు తెలిపాయి. ఇప్పుడు ఈ చైనా గూఢచారి అంశం హైదరాబాద్ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.