నిన్న మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు. ఈ సందర్భంగా రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం చేపట్టారు ఆయన ఫ్యాన్స్. ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో ఇలా రూపాయికే పెట్రోల్ అవకాశం కల్పించారు. రూపాయికే పెట్రోల్ అంటే జనం ఆగుతారా.. విషయం తెలియగానే వందల కొద్దీ వాహనదారులు క్యూ కట్టేశారు.