వెస్ట్ బెంగాల్ లో దీదీ మంచి ఊపు ఉంది. గడిచిన ఎన్నికల్లో మళ్లీ బీజేపీని మట్టి కరిపించి టీఎంసీ అధికారాన్ని నిలబెట్టుకుంది. దీనితో ప్రధాని నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీని క్షేత్ర స్థాయిలో బలపరిచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ అంతకు మించి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కేంద్రంలో మోదీని దెబ్బతీసేందుకు వ్యూహాలు రచిస్తోంది.