ఏపీలో అధికార వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. అదే పార్టీ తరుపున ఎంపీగా గెలిచి రఘురామ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఢిల్లీలో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. అయితే రాజుగారికి ఎక్కడికక్కడ చెక్ పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇప్పటికే రఘురామ ఎంపీ పదవిపై వేటు వేయాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అలాగే రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అయినా రాజుగారు తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వంపై తిరగబడుతూనే ఉన్నారు.