కరోనా వైరస్ అంటే గడగడలాడిపోయే పరిస్థితి ఇప్పుడు మనకు ఉంది. ప్రపంచ దేశాలను వణికించిన కరోనా ఇండియాపై తన ప్రభావాన్ని మరింతగా చూపిస్తోంది. కానీ గత రెండు వారాలుగా కేసుల సంఖ్య మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాలలో సైతం రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో భాగంగా హైద్రాబాద్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కొన్ని కీలక విషయాలను చెప్పారు.