ఏపీలో స్ట్రాంగ్‌గా ఉన్న మంత్రుల్లో పేర్ని నాని ఒకరు. మచిలీపట్నం(బందరు) నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాని మంత్రిగా, జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు తన శాఖపై పట్టు తెచ్చుకుని మంత్రిగా దూసుకెళుతూనే, మరో వైపు అధికార పార్టీ నేతగా ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నారు. అలాగే ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పటిస్తున్నారు. ఓ వైపు బందరు పోర్ట్ పనులు వేగవంతం చేశారు. మరోవైపు బందరు పట్టణంలో కొత్తగా మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.