చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం...ఈ పేరు చెప్పగానే గుర్తుచ్చే పేరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుదే. దశాబ్దాల పాటు కుప్పంలో చంద్రబాబు సత్తా చాటుతున్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన బాబు తర్వాత టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 1989 నుంచి 2019 ఎన్నికల వరకు జరిగిన 7 ఎన్నికల్లో కుప్పంలో బాబుదే విజయం.