ఏపీలో వారసత్వ రాజకీయాలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. నేతలు తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి మంచి పొజిషన్లో పెట్టాలని చూస్తుంటారు. ఇప్పటికే చాలామంది నాయకులు వారసులు ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే పలువురు టీడీపీ సీనియర్లు తమ వారసులని బరిలో దింపారు. జగన్ వేవ్‌లో టీడీపీ వారసులు ఓటమి పాలయ్యారు.