ఈ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించబోతున్నారు. సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ది దారుల ఖాతాల్లో 10 వేల రూపాయల నగదు జమ చేయనున్నారు. ఈ ఏడాది సుమారు రెండున్న ర లక్షల మంది డ్రైవర్లకు ఈ సాయం అందించనున్నారు. ఈ మొత్తం రూ.250 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా.