మొదట్లోనే కరోనా లక్షణాలు ఎక్కువ కనిపించిన వారికి.. కరోనా తీవ్రమై ఆసుపత్రుల్లో చేరిన వారికి.. ఆక్సీజన్ పెట్టడం ద్వారా కరోనా నుంచి బయటపడిన వారికి కరోనా అనంతర ఇబ్బందుల ముప్పు ఎక్కువగా ఉంటోందట. అందుకే కరోనాను జయించాం కదా అని అక్కడితో ఆగిపోకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.. శరీరంలో మార్పులు గమనించండి.