దశాబ్దాలుగా మాన్సాస్ ట్రస్టు, సింహాచలం గుడి ఛైర్మన్ బాధ్యతలని గజపతి రాజుల ఫ్యామిలీ దిగ్విజయంగా నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. మొదట పీవీజీ రాజు వీటికి ఛైర్మన్గా పనిచేశారు. ఆయన మరణం తర్వాత, ఫ్యామిలీలో పెద్ద కుమారుడుగా ఆనంద గజపతిరాజు ఆ భాద్యతలు చూసుకున్నారు. ఆనంద గజపతిరాజు మరణించాక ఆ బాధ్యతలు అశోక్ గజపతిరాజుకు దక్కాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ట్రస్ట్ డీడ్ నిబంధనలకు విరుద్ధంగా అశోక్ గజపతిని తప్పిస్తూ, సంచయితని మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఛైర్మన్గా నియమించారు.