ఈనాడు అధినేత రామోజీ రావుకు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు మధ్య పెద్దగా సంబంధాలు లేని విషయం తెలిసిందే. ఒకవేళ ఉన్నా.. అప్పటికప్పుడు ఉన్న అవసరాల నేపథ్యంలో ఇద్దరూ సర్దుకు పోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. పాదయాత్ర సమయంలో తన వార్తలను కవర్ చేయాలంటూ.. జగన్ స్వయంగా రామోజీని కలిసి అభ్యర్థించినా.. అది అప్పటికే సరిపోయింది. ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఈనాడు వ్యవహారం.. టీడీపీకి అనుకూలంగా మారిపోయింది.