చిత్తూరు పార్లమెంట్ స్థానం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. ఈ స్థానం నుంచి టీడీపీ 7 సార్లు విజయం సాధించింది. పార్లమెంట్ పరిధిలో చంద్రగిరి, నగరి, గంగాధరనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు ఉంటాయి. అయితే ఇందులో కుప్పం ఉండటం వల్ల ఎక్కువసార్లు చిత్తూరు పార్లమెంట్లో టీడీపీ గెలుస్తూ వచ్చింది.