ఏపీలో వైసీపీకి 22 మంది లోక్సభ ఎంపీల బలం ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు 25కి 25 మంది ఎంపీలని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక జగన్ పిలుపుతో ప్రజలు వైసీపీని 22 చోట్ల గెలిపించారు. ఇక టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. అయితే కేంద్రంలో రెండోసారి బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావడంతో మెడలు వంచడం కష్టమని జగన్ మొదట్లోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే.