సర్పగంధ మొక్కల పెంపకం కాసులు కురిపిస్తోంది. ఈ పంటకు తక్కువ ఖర్చుతో అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ సర్పగంధ పంట ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీనిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.