ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, మార్పు తెస్తాను.. అంటూ.. ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్‌ల వ్యవహార శైలి ఒకే విధంగా ఉందని .. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ఇటీవల సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించిన తర్వాత వస్తున్న విశ్లేషణలు కావడం గమనార్హం. నిజానికి ఏ రాష్ట్ర సీఎం కూడా ఇంతగా .. అంటే గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ చేసినన్ని పర్యటనలు ఢిల్లీకి చేయలేదు. కేంద్ర పెద్దల చుట్టూ ఇన్నిసార్లు ప్రదక్షిణలు చేయలేదు.