కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు కాస్త తగ్గాయా? అంటే ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్తితిని బట్టి చూస్తే కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ పూర్తిగా వైసీపీ తరుపున వల్లభనేని వంశీ యాక్టివ్గా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వర్గం మాత్రం లోలోపల అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది.