ఏపీలో అధికార వైసీపీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా వైసీపీ బలపడిపోయింది. అయితే ఇంత బలంగా ఉన్న వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో కాస్త వీక్‌గా ఉందని తెలుస్తోంది. అది కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట వైసీపీ ఇంకా పుంజుకోలేకపోతుందని తెలుస్తోంది. అందులోనూ పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీకి అసలు ఛాన్స్ ఇవ్వడం లేదట.