మాన్సాస్ ట్రస్టు, సింహాచల దేవస్థానం ఛైర్మన్గా సంచయితని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలని హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. వంశ పారంపర్యంగా ఉన్న రూల్స్ ప్రకారం కుటుంబ పెద్దగా ఉన్న అశోక్ గజపతిరాజునే ఛైర్మన్గా కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.