జగన్ ప్రభుత్వాన్ని ఎంపీ రఘురామకృష్ణంరాజు వదిలేలా కనిపించడం లేదు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా నడుస్తున్న రఘురామ, ఈ మధ్య మరింత దూకుడుగా ఉన్నారు. రాజద్రోహం కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద బయటకొచ్చిన రాజుగారు, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి లేఖలు రాస్తున్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలని గుర్తు చేస్తూ, వాటిని అమలు చేయాలని కోరుతున్నారు.