ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సమయం దగ్గర పడుతుంది. సీఎం జగన్ మొదట్లో చెప్పిన విధంగా మరో ఆరు నెలల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు దాటింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరిన గానీ, వచ్చే ఏడాది మొదట్లోగానీ మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.