లేగ దూడల సీరం కోసం పెద్ద ఎత్తున లేగ దూడలను చంపుతున్నారని ఓ కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో ఆరోపణలు చేశాడట. దీని ఆధారంగా మరికొన్ని కట్టుకథలు పుట్టుకొచ్చాయి. దీంతో ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ, భారత్ బయోటెక్ వివరణ ఇచ్చాయి. ఇంతకీ ఆసలు విషయం ఏంటంటే.. కొవాగ్జిన్ టీకాల తయారీలో లేగ దూడల సీరం అనేదే వాడటం లేదట.