రఘురామకృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంతకం లేనందువల్ల ఆయన జుడిషియల్ కస్టడీ నుంచి అసలు విడుదల అయినట్టు తాము భావించలేమని సీఐడీ కోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ నెల 25 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఈనెల 11న సిఐడి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిందట.