ఆస్తి పన్ను పెంపు, చెత్తపన్ను విధించడంపై రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. కానీ జనసేన నాయకులు కానీ, జనసైనికులు కానీ ఎక్కడా ఈ కార్యక్రమాల జోలికి వెళ్లలేదు. కేవలం బీజేపీ నేతలు మాత్రమే తమ పార్టీ ఆఫీస్ లకి పరిమితం అయి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు, ప్లకార్డులు చేతబట్టుకుని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయంలో మిత్రపక్షం జనసేనను ఎందుకు కలుపుకోలేదనేదే ఇప్పుడు ప్రశ్న.